Buddha venkanna: అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు: వైసీపీపై బుద్ధా వెంకన్న విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత సృష్టించారంటూ వైసీపీ నేతలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత లేదంటూ వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారని ఆరోపించారు. 'అయ్యా విజయ సాయిరెడ్డి గారూ... ఇసుక కొరత లేదని ట్విట్టర్ లో మీరు సెలవిచ్చారు. బాగానే ఉంది, మరి మీ మేధావి సీఎం జగన్ ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్టు? ట్రాక్టర్ డ్రైవర్లపై మీ వైసీపీ ఇసుక మాఫియా దాడులు చేసి ఇసుకను ఎత్తుకుపోతోంది. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు' అని ట్వీట్ చేశారు.
 
'రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక గురించి నీతులు మాట్లాడుతున్నారా విజయసాయిరెడ్డి గారు? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి?' అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. 
Go Back to Shorts
Buddha venkanna
YSRCP
Telugudesam

More Telugu News