Road Accident: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఏపీ మంత్రి కన్నబాబు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. కాకినాడ గ్రామీణం తూరంగి వద్ద  శ్రీ చైతన్య పాఠశాల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి వంతెన పిల్లర్‌ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తోన్న నలుగురు కూడా నియంత్రణ కోల్పోయి పడిపోవడంతో గాయాలయ్యాయి.  

అదే సమయంలో కురసాల కన్నబాబు కాకినాడ నుంచి తూరండి మీదుగా అమరావతి వెళుతున్నారు. ఈ ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ ను ఆపి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయాలపాలైన వారిని మరో వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఆ పాఠశాల బస్సులో దాదాపు 100 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Go Back to Shorts
Road Accident
Andhra Pradesh
YSRCP

More Telugu News