chennai: పేదలకు దీపావళి కానుక.. రూపాయికే చొక్కా.. రూ.10కే నైటీ!

షార్ట్స్‌లో చూడండి
చెన్నైకి చెందిన ఆనంద్ దీపావళి వేళ పేదల కళ్లలో ఆనందం నింపేందుకు అద్భుత ఆఫర్ ప్రవేశపెట్టాడు. చాకలిపేటలో తాను నిర్వహిస్తున్న వస్త్రదుకాణంలో ఈ నెల 19 నుంచి 26 వరకు రోజూ ఓ గంటపాటు ప్రత్యేక ఆఫర్‌తో దుస్తులు విక్రయించాడు. ఉదయం 10‌ గంటల నుంచి 11 గంటల వరకు కేవలం రూపాయికే చొక్కా, పది రూపాయలకే నైటీ విక్రయించనున్నట్టు ప్రకటించడంతో జనం అతడి దుకాణానికి క్యూకట్టారు. నిజానికి రోజుకు 50 మందికి మాత్రమే విక్రయించాలనుకున్నా.. పేదలు పోటెత్తడంతో ఆ సంఖ్యను 200గా మార్చాడు.

దుస్తులు దక్కించుకునేందుకు ప్రజలు వేకువజాము నుంచే దుకాణం ముందు పోటెత్తడం మొదలుపెట్టారు. వారం రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంచిన ఆనంద్.. వేలాదిమందికి ఇలా రూపాయికే దుస్తులు విక్రయించి వారి కళ్లలో ఆనందం నింపాడు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ఏదైనా ఓ వస్తువును ఉచితంగా అందిస్తే దానికి విలువ ఉండదని, అందుకనే ఇలా రూపాయి, పది రూపాయల ధర నిర్ణయించి విక్రయించినట్టు చెప్పాడు. దీపావళి నాడు పేదలు కూడా కొత్త దుస్తులు ధరించి జరుపుకోవాలనే ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్టు ఆనంద్ తెలిపాడు.
Go Back to Shorts
chennai
Anand
shirt
offer
Tamil Nadu

More Telugu News