pm: ఈ నెల 29న సౌదీ పర్యటనకు మోదీ

షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో ఒకరోజు పర్యటన జరుపనున్నారు. ఈనెల 29న అక్కడ ప్రారంభం కానున్న ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనీషియేటివ్ (ఎఫ్ఐఐ) వార్షిక సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఈ సదస్సు 29 నుంచి 31వరకు కొనసాగనుంది. ఈమేరకు అధికార వర్గాలు వివరాలను తెలిపాయి.

ఈ పర్యటనలో ఇరుదేశాల నేతలు భేటీ కానున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్ సందర్శించిన సమయంలో పెట్రో కెమికల్స్, మౌలిక సదుపాయాలు, మైనింగ్ రంగాల్లో భారత్ లో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Go Back to Shorts
pm
modi
soudi
prince
Mohammad binu salman

More Telugu News