ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన లోకేశ్, రామ్ చరణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కు బర్త్ డే విషెస్ చెప్పిన లోకేశ్, రామ్ చరణ్

  • ఈరోజు టాలీవుడ్ హీరో ప్రభాస్ బర్త్ డే
  • ‘బ్యాడ్ బాయ్’కు శుభాకాంక్షలంటూ రామ్ చరణ్ పోస్ట్
  •  ప్రభాస్ మరిన్ని మంచి చిత్రాలలో నటించాలన్న లోకేశ్
టాలీవుడ్ హీరో ప్రభాస్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా ప్రభాస్ కు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్యాడ్ బాయ్’కు ‘హ్యాపీ బర్త్ డే’ చెబుతున్నానంటూ హీరో రామ్ చరణ్ ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఓ ఫొటోను పొందుపరిచారు. టీడీపీ నేత నారా లోకేశ్ కూడా ఓ పోస్ట్ చేశారు. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రభాస్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభాస్ మరిన్ని మంచి చిత్రాలలో నటించి, ప్రజలని ఆనందపరచాలని కోరుకుంటున్నానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.
Hero
Prabhas
Ramcharan
Nara Lokesh

More Telugu News