Andhra Pradesh: ఇకపై నవంబరు 1నే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం: ఏపీ ప్రభుత్వం నిర్ణయం

రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న కాకుండా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1నే అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై నెలకొన్న గందరగోళం మధ్యనే గత ప్రభుత్వం జూన్ 2 నుంచి ప్రభుత్వం ఏర్పడిన 8వ తేదీ వరకు నవ నిర్మాణ దీక్షల పేరుతో కార్యక్రమాలు నిర్వహించింది. అయితే, ఇకపై ఏపీ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1నే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నెల 21న పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
Andhra Pradesh
formation day
Jagan

More Telugu News