అందమైన అమ్మాయిల ఎర.. బడాబాబులే టార్గెట్... ఐదు ముఠాల బాగోతం బట్టబయలు!
- న్యూఢిల్లీలో వెలుగులోకి
- హనీట్రాప్ లో చిక్కుకున్న పలువురు ప్రముఖులు
- కేసులను విచారిస్తున్న పోలీసులు
- పరారీలో ప్రధాన నిందితుడు
ఈ డాక్టర్ తో పాటు పలువురు బిల్డర్లు, హోటల్ యజమానులు, నగల వ్యాపారులు, న్యాయవాదులను మొత్తం ఐదు ముఠాలు ఇదే విధమైన హనీ ట్రాప్ లో పడేసి, కోట్ల రూపాయలు గుంజాయి. కొందరి నుంచి డెబిట్ కార్డులు, వాటి పాస్ వర్డ్ లను సైతం ఈ ముఠా తీసుకుందని పోలీసులు తేల్చారు. అమ్మాయిలను పంపించి, బెడ్ రూమ్ దృశ్యాలను వీడియో తీయడమే వీరి పనని, ఇందులో జహంగీర్ గ్యాంగ్ కీలకమని, దీంతో పాటు మిట్టూ ముఠా, పర్మిందర్, రోహిత్ గ్యాంగ్, ముఖేష్ ముఠాలకు ప్రమేయముందని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఫిర్యాదు చేశారని, కేసులన్నీ విచారిస్తున్నామని తెలిపారు. కీలకమైన ముఠా నాయకుడు జహంగీర్ అలియాస్ షేక్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని అన్నారు.