వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించాక షమీ నాకు ఫోన్ చేశాడు: అక్తర్
- షమీ తన బాధను పంచుకున్నాడని చెప్పిన పాక్ బౌలర్
- ఫిట్ నెస్ కాపాడుకోమని సలహా ఇచ్చానని వెల్లడి
- భారత క్రికెటర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న అక్తర్
అయితే, తాను ఫిట్ నెస్ కాపాడుకోమని సలహా ఇచ్చానని, ఫిట్ గా ఉంటేనే పూర్తిస్థాయిలో బౌలింగ్ ప్రదర్శన చేయగలవని చెప్పానని అక్తర్ తెలిపాడు. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్ లో తప్పక రాణిస్తావని ఆత్మవిశ్వాసం నింపానని చెప్పాడు. ఉపఖండం బౌలర్లలో రివర్స్ స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న అతికొద్దిమందిలో షమీ కూడా ఉన్నాడని, రివర్స్ స్వింగ్ రారాజు అవుతాడని అభిప్రాయపడ్డాడు.