Narendra Modi: మోదీని చంపేందుకు ప్లాన్ వేశారంటూ పోలీసులను పరుగులు పెట్టించిన ఆకతాయి

షార్ట్స్‌లో చూడండి
ప్రధాని నరేంద్రమోదీ హత్యకు చేస్తున్న కుట్ర గురించి తాను విన్నానంటూ పోలీసు కంట్రోలు రూముకు ఫోన్ చేసిన ఓ ఆకతాయి పోలీసులను పరుగులు పెట్టించాడు. సోమవారం చెన్నైలో పర్యటిస్తున్న ప్రధాని మోదీని.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసినట్టుగా చంపేందుకు కొందరు ప్లాన్ చేస్తుండగా తాను విన్నానంటూ ఆదివారం ఓ ఆకతాయి చెన్నై పోలీస్ కంట్రోలు రూముకు ఫోన్ చేశాడు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుండగా తాను విన్నానని ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు.

ఆ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు పరుగులు పెట్టారు. తిరువాన్మియూరు నుంచి కాల్ వచ్చిందని తెలుసుకున్న పోలీసులు ఫోన్ చేసిన యువకుడు తిరునావుక్కరసును అదుపులోకి తీసుకుని వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా అతడు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. మోదీ హత్యకు కుట్ర అంతా అబద్ధమని, సరదాగా చేశానని చెప్పడంతో షాకయ్యారు. అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.  
Go Back to Shorts
Narendra Modi
chennai
Tamil Nadu
murder
arrest

More Telugu News