దసరా కానుకగా కొత్త కారు తీసుకువచ్చిన మారుతి
- మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎస్ ప్రెస్సో
- ధర రూ.3.69 లక్షల నుంచి ప్రారంభం
- రేనాల్ట్ క్విడ్ కు గట్టిపోటీ తప్పదంటున్న నిపుణులు
సెక్యూరిటీ ఫీచర్ల పరంగా ఇది ఏ పెద్ద కారుకూ తీసిపోదు. డ్యూయల్ ఎయిర్ బాగ్, పార్కింగ్ సెన్సర్ (రియర్ వ్యూ)తో పాటు స్పీడ్ సెన్సర్ డోర్ లాకింగ్ సదుపాయాలు ఉన్నాయి. బాడీ డిజైన్ చూస్తుంటే అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తయారుచేసినట్టు కనిపిస్తున్నా, చిన్నపట్టణాల వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించారు. ఎస్ ప్రెస్సో రాకతో చిన్న కార్ల విభాగంలో రేనాల్ట్ క్విడ్ కు గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.