Vijay Sai Reddy: వలంటీర్ల పేరు వింటేనే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామ వలంటీర్ల పేరు చెబితేనే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. వలంటీర్లపై వ్యాఖ్యలు చేయడం ద్వారా చంద్రబాబు దిగజారిపోయారని వ్యాఖ్యానించారు. మీ పుత్రరత్నం విదేశీ అమ్మాయిలతో తాగి తందనాలాడిన ఫొటోలను ప్రజలంతా చూశారని, అతడిని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారని విజయసాయి ట్విట్టర్ లో ఆరోపించారు. అలాంటి నేపథ్యంలో మంది పిల్లలపై నిందలు వేయడం తగదని హితవు పలికారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
Chandrababu
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News