పులివెందులలో వాహనం దగ్ధం కేసులో టీడీపీ నేతల అరెస్ట్
కడప జిల్లా పులివెందులలో కొన్నిరోజుల క్రితం టీడీపీ ఆఫీసులో వాహనం దగ్ధమైనట్టు ఫిర్యాదు అందింది. ఈ కేసును విచారించిన పోలీసులు టీడీపీ నేతలే వాహనాన్ని దహనం చేసినట్టు వెల్లడైందని తెలిపారు. ఈ మేరకు టీడీపీ నేతలు మధుసూదన్ రెడ్డి, మహబూబ్ బాషాలను అరెస్ట్ చేశారు. అరెస్టుకు నిరసనగా పీఎస్ వద్ద టీడీపీ నేతల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.