జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు అదే స్థాయిలో బదులిచ్చిన రాజమౌళి
Add ap7am to your home Screen

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు అదే స్థాయిలో బదులిచ్చిన రాజమౌళి

  • స్టూడెంట్ నెం.1కు 18 ఏళ్లు
  • ట్విట్టర్ లో స్పందించిన ఎన్టీఆర్, రాజమౌళి
  • తామిద్దరిలో వచ్చిన మార్పును వివరించిన జక్కన్న
జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం రిలీజై నేటికి 18 ఏళ్లు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూనియర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్ చేసింది సాయంత్రం 4.30 గంటలకు కాగా, రాజమౌళి కూడా సరిగ్గా 4.30 గంటలకే ట్వీట్ చేశారు.

"18 ఏళ్లు! సరిగ్గా ఇదే రోజున స్టూడెంట్ నెం.1 రిలీజైంది. కాకతాళీయంగా మేము రామోజీ ఫిలింసిటీలో ఉన్నాం. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది, ఎన్టీఆర్ సన్నబడ్డాడు, నేను వయసు పైబడ్డాను" అంటూ రాజమౌళి ఫన్నీగా ట్వీట్ చేశారు. అంతేకాదు, ఎన్టీఆర్ పోస్టు చేసిన తరహాలోనే స్టూడెంట్ నెం.1 షూటింగ్ నాటి ఓ పిక్ ను పోస్టు చేసి దానికింది భాగంలో తామిద్దరి లేటెస్ట్ ఫొటోను అటాచ్ చేశారు.
Rajamouli
Jr NTR
Tollywood
Student No.1

More Telugu News