గెటప్ శీనుని ఆకాశానికి ఎత్తేసిన నాగబాబు
- గెటప్ శీను మంచి నటుడు
- ఏ పాత్రనైనా అవలీలగా చేస్తాడు
- చిత్రపరిశ్రమ అతని ప్రతిభను ఉపయోగించుకోవాలన్న నాగబాబు
ఈ వేదికపై నాగబాబు మాట్లాడుతూ .. "రామ్ ప్రసాద్ మంచి రచయిత .. నటుడు. సుడిగాలి సుధీర్ మంచి టైమింగ్ వున్న నటుడు. ఇక గెటప్ శీను విషయానికొస్తే, ఇంతవరకూ ఆయన గురించి పబ్లిక్ లో ఎక్కడా మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు చెబుతున్నాను .. గెటప్ శీను వంటి ఆర్టిస్టును ఈ జనరేషన్ లో నేను చూడలేదు. ఏ భాషలోనైనా అంతర్జాతీయ స్థాయిలో నటించగలిగే ఏకైక నటుడని చెప్పగలను. తెలుగు చిత్రపరిశ్రమ అతణ్ణి ఉపయోగించుకోకపోతే, ఒక ఆణిముత్యాన్ని కోల్పోయినట్టు అవుతుంది" అంటూ గెటప్ శీనుని ఆకాశానికి ఎత్తేశారు.