శివప్రసాద్ మృతదేహాన్ని చూసి, భావోద్వేగానికి లోనైన వైకాపా నేత పెద్దిరెడ్డి!
- ఈ ఉదయం నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి
- కుటుంబ సభ్యులకు పరామర్శ
- నేడు ముగియనున్న అంత్యక్రియలు
తనను శివప్రసాద్ అన్నయ్యా అంటూ ప్రేమతో పలకరించేవారని, అటువంటి మిత్రుడిని తాను కోల్పోయానని అన్నారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను పెద్దిరెడ్డి పరామర్శించారు. కాగా, శివప్రసాద్ అంత్యక్రియలు నేడు చంద్రగిరి సమీపంలోని అగరాలలో జరగనున్నాయి. ఆయనకు కడసారి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు లోకేష్ తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. మరికాసేపట్లో శివప్రసాద్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.