Uttar Pradesh: రేప్ కేసులో బీజేపీ నేత స్వామి చిన్మయానందను అరెస్ట్ చేసిన పోలీసులు!

షార్ట్స్‌లో చూడండి
లా చదువుతున్న 23 ఏళ్ల యువతిని సంవత్సరం పాటు రేప్ చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద(73)ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లా కాలేజీలో సీటు ఇప్పిస్తానని ఆశపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా చెప్పింది.

తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని సదరు లా విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయాన్నే షాజహాన్ పూర్ లోని చిన్మయానంద ఆశ్రమానికి చేరుకున్న సిట్ అధికారులు.. చిన్మయానందను అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Go Back to Shorts
Uttar Pradesh
Rape
SIT
LAW STUDENT
23 YEARS
Police
ARREST
SWAMI CHINMAYANAND

More Telugu News