దేవీపట్నం వద్ద మరో ఐదు మృతదేహాల గుర్తింపు... 31కి చేరిన మృతుల సంఖ్య

  • కచ్చులూరు వద్ద గోదావరిలో పడవ మునక
  • 39 మంది గల్లంతు
  • తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటన
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునక ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనలో 39 మంది వరకు గల్లంతు కాగా, నిన్నటివరకు 26 మృతదేహాలను వెలికితీశారు. తాజాగా దేవీపట్నం వద్ద ఇవాళ మరో 5 మృతదేహాలను గుర్తించారు. సహాయ చర్యల్లో పాల్గొంటున్న సిబ్బంది వాటిలో మూడు మృతదేహాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వాటిని రాజమండ్రి తరలించారు. ప్రస్తుతం మృతుల సంఖ్య 31కి చేరింది.
Go Back to Shorts
Godavari
East Godavari District
Deviptnam

More Telugu News