నానీస్ ‘గ్యాంగ్ లీడర్’ కు పాజిటివ్ టాక్.. మరో ఫన్నీ ట్వీట్ వదిలిన హీరో నాని!
- నిన్న విడుదలైన నానీస్ ‘గ్యాంగ్ లీడర్’
- సినీ విమర్శల నుంచి ప్రశంసలు
- నానిపై ప్రశంసలు కురిపించిన అనిరుధ్
తాజాగా హీరో నాని తనకూ, సీనియర్ నటి లక్ష్మీకి మధ్య సంభాషణ జరుగుతున్నట్లు సరదాసరదాగా ఓ ట్వీట్ చేశాడు. అందులో నాని మాట్లాడుతూ.. ‘ఏంటి బామ్మా?.. ఇంత వయొలెంట్ గా లేపేశారు?’ అని అడిగితే, లక్ష్మి స్పందిస్తూ..‘ఒకసారి ట్విట్టర్ లో నీ మెన్షన్స్ చూసుకో’ అని జవాబిచ్చినట్లు ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి మరో ఫొటోను కూడా నాని జతచేశాడు. అంతలోనే గ్యాంగ్ లీడర్ సంగీత దర్శకుడు అనిరుధ్ స్పందిస్తూ..‘నిద్రలేచే సమయం వచ్చేసింది బ్రదర్.. ఇంకో సూపర్ హిట్ సినిమా కొట్టారు’ అని ప్రశంసించాడు.