నిమజ్జనం వేళ.. ప్రతి నాలుగున్నర నిమిషాలకో మెట్రో రైలు
- నేటి అర్ధరాత్రి వరకు తిరగనున్న రైళ్లు
- నిమజ్జనాన్ని తిలకించేందుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం వేళల పొడిగింపు
- వెల్లడించిన మెట్రో రైల్ ఎండీ
సాధారణంగా మియాపూర్, ఎల్బీనగర్ నుంచి రాత్రి పదిన్నర గంటలకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరుతాయని, కానీ నేడు భక్తుల రద్దీ సౌకర్యార్థం అర్ధరాత్రి వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఖైరతాబాద్ వరకు మెట్రోలో సులభంగా చేరుకునే అవకాశం ఉండడంతో రైలు సమయాన్ని పొడిగించినట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.