'డిస్కోరాజా' విడుదల తేదీ ఖరారు
- విభిన్నమైన కథాంశంతో 'డిస్కోరాజా'
- అలరించనున్న ముగ్గురు కథానాయికలు
- డిసెంబర్ 20న విడుదల
ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు కథానాయికలు కనిపించనుండటం విశేషం. పాయల్ రాజ్ పుత్ .. నభా నటేశ్ .. తాన్యా హోప్ ఆయన సరసన జత కడుతున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మాస్ హీరోగా రవితేజ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.