'బిగ్ బాస్ 3'లో ఆయన చివరివరకూ నిలబడే అవకాశం వుంది: హీరో ప్రిన్స్
Add ap7am to your home Screen

'బిగ్ బాస్ 3'లో ఆయన చివరివరకూ నిలబడే అవకాశం వుంది: హీరో ప్రిన్స్

  • 'బిగ్ బాస్ 2' ఇంట్రెస్టింగ్ గా అనిపించింది 
  • 'బిగ్ బాస్ 3' అంత ఆసక్తికరంగా లేదు 
  • రేసులో వీళ్లు మాత్రమే కనిపిస్తున్నారన్న ప్రిన్స్
తెలుగు తెరపై యువ కథానాయకుడిగా ప్రిన్స్ కి మంచి క్రేజ్ వుంది. ఆ తరువాత ఆయన 'బిగ్ బాస్' సీజన్ వన్ లో 54 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో వున్నాడు. అందువలన 'బిగ్ బాస్ ప్రిన్స్' గా కూడా ఆయనను పిలుస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతోన్న 'బిగ్ బాస్ 3' గురించి ప్రస్తావించాడు.

 "నేను 'బిగ్ బాస్' చేసినప్పటి పరిస్థితులు వేరు .. అక్కడి వాతావరణం వేరు. అందువలన కాస్త భయంతోనే ఆ రోజులు గడిచాయి. ఆ తరువాత నాని హోస్ట్ చేసిన 'బిగ్ బాస్ 2' నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రస్తుతం జరుగుతోన్న 'బిగ్ బాస్ 3'ని వీలును బట్టి చూస్తున్నాను. ఎందుకో ఈ సీజన్ నాకు పెద్ద ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో వుండేవాళ్లల్లో నాకు 'బాబా మాస్టర్' వ్యక్తిత్వం నచ్చింది. చివరివరకూ ఆయన నిలబడతాడనిపిస్తుంది. ఇక రేసులో వరుణ్ సందేశ్ .. శ్రీముఖి .. శివజ్యోతి కనిపిస్తున్నారు" అని చెప్పుకొచ్చాడు.
Prince

More Telugu News