శ్రీనగర్ దాకా ఎందుకు, ముందు ముజఫరాబాద్ ను కాపాడుకోండి చాలు!: పాక్ ప్రభుత్వంపై బిలావల్ భుట్టో ఫైర్
- ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో విమర్శలు
- పాక్ ప్రభుత్వం బలహీన విధానాలు పాటిస్తోందంటూ మండిపాటు
- ఇమ్రాన్ సర్కారు సమర్థతను ప్రశ్నించిన భుట్టో
'శ్రీనగర్ దాకా వెళ్లాల్సిన పనిలేదు, ముజఫరాబాద్ ను రక్షించుకోవడమే ప్రభుత్వ ప్రధాన పాలసీగా మారిపోయింది' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాక్ ప్రభుత్వం బలహీన సిద్ధాంతాలు, విధానాలతో నెట్టుకొస్తోందని బిలావల్ విమర్శించారు. ఇమ్రాన్ స్వార్థపూరిత వైఖరితో పాక్ ప్రభుత్వ ప్రాధామ్యాలే మారిపోయాయని అన్నారు.