Road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోలను ట్రక్కు ఢీకొట్టడంతో 16 మంది మృతి

షార్ట్స్‌లో చూడండి
అదుపు తప్పిన ట్రక్కు అదే రోడ్డులో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టిన ప్రమాదంలో పదహారు మంది అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లో ఈరోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు..

 షాజహాన్‌పూర్‌ జిల్లా కేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారిపై తాను  నడుపుతున్న ట్రక్కుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో అదే రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న రెండు టెంపోలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో టెంపోలు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులోని వారిలో 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడగా స్థానికులు హుటాహుటిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందిస్తూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Road Accident
Uttar Pradesh
truck tempos coluued
16 died

More Telugu News