Bigg Boss: బిగ్ బాస్-3... బయటకు వచ్చాక నలుగురిపై అషూ రెడ్డి ఆగ్రహం!

షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియా ముందే చెప్పినట్టుగా, ఐదోవారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి అషూ రెడ్డి ఎలిమినేట్ అయింది. నిన్నటి ఎపిసోడ్ లో ఆద్యంతం నవ్వులు పూయించిన హోస్ట్ నాగ్, సభ్యులకు జంతువుల మొహాలు తగిలించి, వారితో ఆడించారు. ఒకరిలా మరొకరు నటించాలని చెప్పి మరో టాస్క్ చేయించారు.

ఆపై అషూ రెడ్డి ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. ఆపై హౌస్ ను వీడి బయటకు వచ్చిన అషూ చేత మరో గేమ్‌ ను ఆడించిన నాగ్, హౌస్‌ లో ఉండేందుకు అర్హత ఎవరికి ఉంది? ఎవరికి లేదు? అంటూ అడిగారు. అర్హత లేదని భావించేవారి ఫోటోలను పగలగొట్టాలని సూచించారు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో తనతో గొడవలు పడిన వారిపై అషూ ఆగ్రహాన్ని చూపించింది. మహేష్‌, రాహుల్‌, వితికా, హిమజలకు లోపల ఉండే అర్హత లేదంటూ వారి ఫోటోలను పగలగొట్టి, తన కసి తీర్చుకుంది.

Go Back to Shorts
Bigg Boss
Ashu Reddy
Eliminate

More Telugu News