Andhra Pradesh: ఏపీ మంత్రి వెల్లంపల్లికి మాతృవియోగం
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు తల్లి మహాలక్ష్మమ్మ ఇవాళ మృతి చెందారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మహాలక్ష్మమ్మ విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలు సోమవారం నిర్వహించాలని వెల్లంపల్లి కుటుంబీకులు నిర్ణయించారు. కాగా, వెల్లంపల్లి శ్రీనివాసరావుకు సీఎం జగన్ సానుభూతి తెలియజేశారు. ఇతర వైసీపీ నేతలు కూడా మంత్రిని పరామర్శించారు.