మునుపెన్నడూ కనిపించని కొత్త గెటప్పులో బాలకృష్ణ
Add ap7am to your home Screen

మునుపెన్నడూ కనిపించని కొత్త గెటప్పులో బాలకృష్ణ

  • వాన్ డైక్ గడ్డంతో బాలయ్య న్యూ లుక్
  • పట్టాలెక్కుతున్న బాలకృష్ణ 105వ చిత్రం
  • సి. కల్యాణ్ నిర్మాతగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిత్రం
అగ్రహీరో నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం పట్టాలెక్కుతోంది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి బాలయ్య అఫిషియల్ గెటప్ రిలీజైంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా వాన్ డైక్ తరహా గడ్డంతో బాలకృష్ణ సూటూబూటూ ధరించి కొత్త లుక్ తో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాడు. వాన్ డైక్ గడ్డం అంటే చెంపలపై వెంట్రుకలన్నీ షేవ్ చేసి, కేవలం గడ్డం వద్ద మాత్రమే వెంట్రుకలు ఉంచుతారు.

వాస్తవానికి ఇది యూరోపియన్ తరహా స్టయిల్. వాన్ డైక్ గడ్డం ఇప్పటిది కాదు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఆంటోనీ వాన్ డైక్ కూడా ఇలాగే మేక తరహాలో గడ్డం వద్ద మాత్రమే వెంట్రుకలు ఉంచుకుని విలక్షణంగా కనిపించేవాడు. అప్పట్లో ఈ తరహా గడ్డాన్ని రాచరికపు వ్యక్తులు కూడా ఫాలో అయ్యేవారు. ఇది క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది.

తాజాగా, ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు వాన్ డైక్ గడ్డంతో ఉన్న బాలయ్య ఫొటోను పోస్టు చేసి వివరాలు తెలిపారు. మామూలుగా అయితే ఈ గెటప్పులో బాలకృష్ణను పోల్చుకోవాలంటే కాస్త కష్టమైన పనే. అంత డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. హ్యాపీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలు.
Balakrishna
Van Dyke
Beard
Tollywood

More Telugu News