కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడం వెనుక నా పాత్ర ఉంది: బాబుమోహన్
Add ap7am to your home Screen

కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడం వెనుక నా పాత్ర ఉంది: బాబుమోహన్

  • పాలన చేతకాకే బీజేపీని టీఆర్ఎస్ విమర్శిస్తోంది
  • కూల్చడం తప్ప కేసీఆర్ కు మరేమీ తెలియదు
  • నాకు పదవులు ముఖ్యం కాదు
తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని ఆ పార్టీ నేత, సినీ నటుడు బాబు మోహన్ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదుకు భారీ స్పందన వస్తోందని చెప్పారు. సభ్యత్వ నమోదుపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని చెప్పారు. పరిపాలించడం చేతకాకే... బీజేపీపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. క్షేత్ర స్థాయిలో బీజేపీ ఎంత బలంగా ఉందో కొంత కాలం ఆగితే టీఆర్ఎస్ కు అర్థమవుతుందని చెప్పారు. కూల్చడం తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరేమీ తెలియదని అన్నారు.

రాజకీయాల్లో అవుట్ డేట్ కావడం ఉండదని... ఎన్నికల్లో ఓడిపోతే కేసీఆర్, కేటీఆర్ ఔట్ డేట్ అవుతారా? అని బాబు మోహన్ ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని... పార్టీ ఏ పని అప్పజెప్పినా కష్టపడి పని చేస్తానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఓడిపోవడం వెనుక తన పాత్ర ఉందని తెలిపారు.
Babu Mohan
Kavitha
KCR
KTR
TRS
BJP

More Telugu News