Venkatesh: 'వెంకీ మామ' షూటింగ్ లో వెంకటేశ్ కు గాయాలు!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విక్టరీ వెంకటేశ్, గాయపడ్డారు. సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా, పాయల్ రాజ్ పుత్, వెంకటేశ్ ల మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఓ డ్యాన్స్ మూమెంట్ చేస్తున్న వేళ, ఆయన కాలు బెణికింది. లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్న వెంకటేశ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, కాలును చూపి పరిశీలించిన వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని చిత్ర యూనిట్ తెలిపింది. వెంకీ కాలికి గాయంతో సినిమా షూటింగ్ సైతం కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికాగా, మిగతా భాగాన్ని శరవేగంగా చిత్రీకరిస్తున్న వేళ, ఈ ఘటన జరిగడం గమనార్హం.
Go Back to Shorts
Venkatesh
Venki Mama
Accident

More Telugu News