ఎమ్మెల్యేగా మారిన గ్యాంగ్ స్టర్ ఇంటిలో పోలీసుల సోదాలు... ఏకే47 స్వాధీనం
- బీహార్ మొకామా ఎమ్మెల్యే అనంత్ కుమార్ నివాసంపై దాడులు
- ఏకే47ను సీజ్ చేసిన పోలీసులు
- నివాసానికి చేరుకున్న ఎస్టీఎఫ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్
అయితే ఊహించని విధంగా ఏకే47 లభ్యం కావడంతో, పోలీసులు దాన్ని సీజ్ చేశారు. మరోవైపు స్పెషల్ టాస్క్ ఫోర్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకుంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, పోలీసు జాగిలాలను కూడా రప్పిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.