Amaravathi: రాజధాని అమరావతిని చంపేశారు.. పిల్లల భవిష్యత్తు ఏంటి?: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ కు దీటుగా అమరావతి ఉండాలని తాను ప్రణాళికలు తయారు చేస్తే, ఎన్నికలు అయిన తర్వాత ఏమైందో ప్రజలే చూస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజధాని అమరావతిని చంపేశారని విమర్శించారు. పిల్లల భవిష్యత్తు ఏంటి? ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విదేశాలకు వెళ్లాలా? అని ప్రశ్నించారు.

 ‘మనకంటూ ఒక రాజధాని ఉండి, మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే అర్హత మనం సంపాదించుకోలేమా అనే ఉద్దేశంతో రాజధాని కడితే, దాని మీద కక్ష గట్టి అమరావతిని చంపేసే పరిస్థితికి వచ్చారు’ అంటూ మండిపడ్డారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా బ్యాంకు చాలా తక్కువ వడ్డీకే ఆ నిధులు ఇచ్చాయని, ఆ నిధులను ఏపీ ప్రభుత్వం పోగొట్టిందని విమర్శించారు. ఒక పైసా అప్పు చేయకుండా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని తాను కలలు కంటే ఈరోజు ఏం చేశారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 
Go Back to Shorts
Amaravathi
Telugudesam
Chandrababu
YSRCP
jagan

More Telugu News