మనసు మార్చుకున్న హీరో రామ్!
Add ap7am to your home Screen

మనసు మార్చుకున్న హీరో రామ్!

  • 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టిన రామ్ 
  • మళ్లీ మాస్ యాక్షన్ పైనే దృష్టి
  •  'తడమ్' రీమేక్ ఇప్పట్లో లేనట్టే   
రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని నమోదు చేసింది. చాలా కాలం తరువాత పెద్ద విజయం లభించడంతో రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఈ సినిమా పరాజయంపాలైతే 'తడమ్' అనే తమిళ సినిమా రీమేక్ చేయాలని రామ్ అనుకున్నాడట. అరుణ్ విజయ్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై హిట్ కొట్టింది.

'ఇస్మార్ట్ శంకర్' ఫలితం నిరాశ పరిస్తే, అందుకు పూర్తి భిన్నమైన కథతో సాగే 'తడమ్' రీమేక్ లో చేయాలని రామ్ నిర్ణయించుకున్నాడట. కానీ 'ఇస్మార్ట్ శంకర్' భారీ విజయాన్ని సాధించడంతో, ఇప్పుడు 'తడమ్' రీమేక్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడని చెబుతున్నారు. మాస్ ఆడియన్స్ నుంచి తనకి వచ్చిన రెస్పాన్స్ .. మాస్ లో పెరిగిన క్రేజ్ కారణంగా మళ్లీ మాస్ కంటెంట్ తోనే సినిమా చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చాడని సమాచారం. కాస్త ఆలస్యమైనా మంచి కథతో .. దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. 
Ram

More Telugu News