‘మన్మథుడు 2’ ప్రీ రిలీజ్ వేడుక.. ‘ఆగస్టు’ అంటే నాకు చాలా ఇష్టం: హీరో నాగార్జున

  • ఈ నెలలోనే ‘బిగ్ బాస్’ ప్రారంభమైంది
  • ‘మన్మథుడు 2’ విడుదల కాబోతోంది ఈ నెలలోనే
  • రకుల్ ప్రీత్ సింగ్ చాలా గొప్ప నటి
‘మన్మథుడు 2’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు.ఆగస్టు నెల అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవలే ‘బిగ్ బాస్’ ప్రారంభమైందని, మన్మథుడు2 చిత్రం రిలీజ్ కాబోతోందని అన్నారు. ఇంకా ప్రేమకథా చిత్రంలో నటించడమేంటని చాలా మంది తనను అడిగారని, ఏ వయసులో నైనా ప్రేమించ వచ్చని చెప్పే ఫ్రెంచ్ కథ ఇది అని అన్నారు. ఈ చిత్రంలో తన సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఆమె గొప్ప నటి, ఆరోగ్యం గురించి ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చని చెప్పారు.
Go Back to Shorts
Manmadhudu
Hero
Nagarjuna
Rakul preet singh

More Telugu News