సౌర కుటుంబానికి ఆవల మానవ నివాసానికి అనుకూల గ్రహం!
- భూమికి 31 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహం
- కనుగొన్న నాసా ‘టెస్’
- భూమికి మించిన ద్రవ్యరాశి
‘జీజే 357 డీ’గా పిలుస్తున్న ఈ గ్రహం సౌర కుటుంబం వెలుపల భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే ఉపగ్రహం(టెస్)’ దీనిని గుర్తించింది. భూమితో పోలిస్తే ఈ గ్రహం ద్రవ్యరాశి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి దీనిని ‘సూపర్ ఎర్త్’గా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణం కూడా ఈ గ్రహంపై దట్టంగా ఉందని చెబుతున్న శాస్త్రవేత్తలు అత్యాధునిక టెలిస్కోపులతో జీవం ఉనికిని గుర్తించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.