నితిన్ .. కీర్తి సురేశ్ అదరగొట్టేస్తున్నారట!
- వెంకీ అట్లూరి నుంచి 'రంగ్ దే'
- నితిన్ జోడీగా కీర్తి సురేశ్
- వచ్చే వేసవి కానుకగా రిలీజ్
పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. నితిన్ .. కీర్తి సురేశ్ ఇద్దరూ కూడా పోటీపడి నటిస్తున్నారనీ, వాళ్లిద్దరి నటన గుర్తుండిపోయేలా ఉంటుందంటూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా తమ జీవితాలను మరింత రంగులమయం చేయనుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం వున్నట్టుగా తెలుస్తోంది.