బిగ్‌బాస్-3: పునర్నవికి వరుణ్ సందేశ్ సపోర్ట్.. గుక్కపట్టి ఏడ్చిన వితిక!
Add ap7am to your home Screen

బిగ్‌బాస్-3: పునర్నవికి వరుణ్ సందేశ్ సపోర్ట్.. గుక్కపట్టి ఏడ్చిన వితిక!

  • టాస్క్ చేసేందుకు రమ్మన్న పునర్నవి
  • తనను టార్గెట్ చేయవద్దన్న వితిక
  • పరస్పర క్షమాపణలతో కథ సుఖాంతం
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో జంటగా హౌస్‌లోకి అడుగుపెట్టిన వరుణ్ సందేశ్-వితికా శెరు మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం, ఆ వెంటనే క్షమాపణలతో సద్దుమణగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

హౌస్‌లో అందరూ గ్యాస్, కరెంట్‌ను వృథా చేస్తుండడంతో వాటి విలువ తెలుసుకునేందుకు బిగ్‌బాస్ వారికి టాస్క్ విధించాడు. మూడు సైకిళ్లు ఇచ్చి వాటిని తొక్కడం ద్వారా గ్యాస్, కరెంటును ఉత్పత్తి చేసుకోవాలని సూచించాడు. అందరూ టాస్క్‌లో బిజీగా ఉంటే వితిక మాత్రం వంట గదిలో ఉండడంతో పునర్నవి పిలిచేందుకు వెళ్లి, ఆమెను కూడా సైకిలు తొక్కాలని సూచించింది.

దీంతో వివాదం మొదలైంది. తనను టార్గెట్ చేయవద్దని, తాను దోసెలు వేస్తున్నానని పేర్కొంది. అక్కడే ఉన్న వరుణ్ సందేశ్ తన భార్య వితికకు కాకుండా పునర్నవికి సపోర్ట్ చేయడంతో వితిక తట్టుకోలేకపోయింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగిన తర్వాత వితిక గుక్కపట్టి ఏడ్చింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇది చూసి తట్టుకోలేకపోయిన వరుణ్ ఆమె చేతిలో చేయి వేసి క్షమించమని కోరాడు. ఆ వెంటనే వితిక కూడా వరుణ్‌కు సారీ చెప్పడంతో కథ సుఖాంతమైంది.
Bigboss
star maa
vitika sheru
varun sandesh

More Telugu News