తప్పిపోయిన 22 ఏళ్ల తర్వాత తల్లి ఒడిని చేరిన కొడుకు
- ఉబ్బితబ్బిబ్బయిన మాతృమూర్తి
- మతిస్థిమితం లేక కేరళ వెళ్లిపోయిన బాధితుడు
- ఇన్నేళ్ల తర్వాత కోలుకోవడంతో ఇంటికి చేర్చిన అక్కడి వారు
మూడేళ్ల క్రితం అక్కడి తెలుగువారు నంబయ్యను గుర్తించారు. అతని మానసిక స్థితి సరిగా లేదని గమనించి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. కోలుకున్నాక వివరాలు తెలుసుకున్నారు. ఊరు పేరు చెప్పడంతో రెండు రోజుల క్రితం బెల్లంపల్లి పట్టణంలోని మహ్మద్‌ఖాసిం బస్తీకి తీసుకువచ్చారు. అనంతరం తల్లి రాజమ్మను రప్పించి కొడుకును చూపించారు. 22 ఏళ్ల తరువాత కొడుకు కనిపించడంతో రాజమ్మ భావోద్వేగానికి గురయ్యింది. కన్నీటి పర్యంతమవుతూ అక్కున చేర్చుకుంది.
ఎటో వెళ్లిపోయిన కొడుకు ఇన్నేళ్లయినా ఆచూకీ లేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించామని, తిరిగి వస్తాడని కలలో కూడా ఊహించలేదని ఆమె అంది. స్థానికులు కూడా నంబయ్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్ల తర్వాత కూడా తమలో చాలామంది పేర్లు నంబయ్య చెప్పడంతో పట్టరానంత ఆనందానికి లోనయ్యారు. ఆప్యాయంగా పలకరిస్తూ అతన్ని తమ వాడిగా మార్చుకున్నారు.