భువనేశ్వర్ లో ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ తో విజయసాయిరెడ్డి భేటీ
- గవర్నర్ కు శుభాకాంక్షలు చెప్పిన విజయసాయిరెడ్డి
- శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటం బహూకరణ
- లింగరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కాగా, ఏపీ నూతన గవర్నర్ గా నియమితులైన హరిచందన్ ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించనున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం రాజ్ భవన్ వద్ద ఏర్పాట్లను ప్రారంభించారు. ఈ పనులను ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి అర్పీ సిసోడియా, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా పరిశీలించారు. ఈ నెల 23న భువనేశ్వర్ నుంచి తిరుపతికి హరిచందన్ వస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని విజయవాడకు బయలుదేరుతారు. ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నాక 24వ తేదీన ఉదయం 11.30 గంటలకు గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తారు.