ఇన్ స్టాగ్రామ్ లో లోపాన్ని గుర్తించి రూ.20 లక్షలు అందుకున్న చెన్నై టెక్కీ
- పాస్ వర్డ్ రీసెట్ ప్రక్రియలో బగ్ ను గుర్తించిన లక్ష్మణ్ ముత్తయ్య
- రికవరీ కోడ్ చేజిక్కించుకుని ఎవరి అకౌంట్లోనైనా ప్రవేశించవచ్చని నిరూపించిన వైనం
- లోపాన్ని సవరించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నిపుణులు
పాస్ వర్డ్ రీసెట్ చేసే సమయంలో ఫోన్ కు గానీ, ఈమెయిల్ కు గానీ వచ్చే రికవరీ కోడ్ ను చేజిక్కించుకోవడం ఇన్ స్టాగ్రామ్ లో పెద్ద కష్టంకాదని లక్ష్మణ్ ఫేస్ బుక్ నిపుణులకు వివరించాడు. ఈ చెన్నై నిపుణుడి సూచనలకు వెంటనే స్పందించిన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ నిపుణులు వెంటనే సదరు బగ్ ను ఫిక్స్ చేశారు. పాస్ వర్డ్ రీసెట్ ప్రక్రియలోని లోపాన్ని సవరించారు. అంతేకాకుండా, ఎంతో విలువైన సూచన చేశాడంటూ లక్ష్మణ్ కు రూ.20 లక్షల రివార్డు కూడా అందించారు.