మా నాన్నతో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' చూడొచ్చా?... అని హీరో రామ్ ను అడిగిన అభిమాని!
Add ap7am to your home Screen

మా నాన్నతో కలిసి 'ఇస్మార్ట్ శంకర్' చూడొచ్చా?... అని హీరో రామ్ ను అడిగిన అభిమాని!

  • ట్విట్టర్ ద్వారా అభిమానులతో సంభాషించిన రామ్
  • అభిమానుల ప్రశ్నలకు 'ఇస్మార్ట్' సమాధానాలు
  • నేడు విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్'
రామ్ హీరోగా నటించిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం నేడు విడుదల కాగా, చిత్ర ప్రమోషన్ లో భాగంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ తన ఫ్యాన్స్ తో చర్చించాడు. పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఓ అభిమాని తన తండ్రితో కలిసి ఈ సినిమాకు వెళుతున్నానని, ఫర్వాలేదా? అని ప్రశ్నించాడు. దీనికి రామ్ స్పందిస్తూ, "మీ నాన్నతో స్నేహంగా ఉంటే కలిసి చూడండి. లేదు కాస్త బయం ఉంటే విడివిడిగా చూడండి. ఇంకేం చెబుతాం" అన్నాడు.

ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారన్న మరో ఫ్యాన్ ప్రశ్నకు, అన్నీ కుదిరిన తరువాత ప్రకటిస్తానని, అదెప్పుడంటే మాత్రం తెలియదని అన్నాడు. 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ ఉంటుందా? అన్న ప్రశ్నకు, దానికి సమాధానం అభిమానుల చేతుల్లోనే ఉందన్నాడు. ఫ్యాన్సే తనకు ప్రాణమని, ఈ సినిమాను సినిమాలా చూడాలని, తన క్యారెక్టర్ ను అనుకరించవద్దని సలహా ఇచ్చాడు. ఈ సినిమాను ప్రాణం పెట్టి, ప్రేమతో తీశామని చెప్పాడు. ఇక ఈ ట్వీట్ల సంభాషణలోకి ఎంటరైన సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్, తన గురించి ఒక్క మాటలో చెప్పాలని కోరగా, అది కుదరని పనని, నీ వంటి అమ్మాయిని ఒక్క మాటలో వర్ణించడం కష్టమని అన్నాడు.
Ram
Twitter
Fans
Ismart Shankar

More Telugu News