మాజీ ఎమ్మెల్యే ఆమంచి సోదరుడి కుమారుడిపై అట్రాసిటీ కేసు నమోదు
- హోంగార్డు రవికుమార్‌కు ఫోన్ చేసి బెదిరించిన రాజేంద్ర
- సీఐ బేతపూడి ప్రసాద్‌పైనా అనుచిత వ్యాఖ్యలు
- సోషల్ మీడియాలో తిట్లు వైరల్
తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజేంద్రపై ఆదివారం బేతపూడి ప్రసాద్ చీరాల టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో టేపులను పోలీసులకు అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు రాజేంద్రపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.