Rains: నేడు, రేపు పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షాలు!

షార్ట్స్‌లో చూడండి
గత వారంలో చురుకుగా కదిలిన నైరుతి రుతుపవనాల కదలికలు, ప్రస్తుతం సాధారణ స్థాయిలో కొనసాగుతూ ఉండటంతో, వర్షాలు తగ్గిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారి రాజారావు వెల్లడించారు. నిన్న ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెలంగాణలోని 166 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇదిలావుండగా, వర్షాలు తగ్గడంతో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల వరకూ అధికంగా నమోదయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఉక్కపోతను అనుభవించారు.
Go Back to Shorts
Rains
Telangana
Hyderabad
Andhra Pradesh

More Telugu News