చెన్నై పరిస్థితి దయనీయం... రైళ్ల ద్వారా మంచినీటి తరలింపు
- రోజుకు 10 మిలియన్ లీటర్ల తరలింపు
- చెన్నై నగర రోజువారీ కనీస వినియోగం 525 మిలియన్ లీటర్లు
- భవిష్యత్ లో నీటి లభ్యతపై నిపుణుల ఆందోళన
ఈ తీరప్రాంత నగరంలో దినసరి నీటి వినియోగం 525 మిలియన్ లీటర్లు కాగా, ప్రభుత్వం తనవంతుగా 10 మిలియన్ లీటర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. ఇది కనీస నీటి వినియోగంలో రెండు శాతం మాత్రమే. సాధారణ అవసరాల కోసం స్థానికంగా నీటిని అందుబాటులోకి తెచ్చుకుంటున్నప్పటికీ, భవిష్యత్ లో ఈ మాత్రం కూడా నీటి లభ్యత ఉండకపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.