చావుబతుకుల్లో మనస్విని... పరిస్థితి విషమమంటున్న వైద్యులు!

చావుబతుకుల్లో మనస్విని... పరిస్థితి విషమమంటున్న వైద్యులు!

  • నిన్న ఉన్మాది దాడిలో గాయాలు
  • వెంటిలేటర్ పై వైద్య చికిత్స
  • ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు
మంగళవారం నాడు తాను నమ్మిన యువకుడితో కలిసి హైదరాబాదులోని ఓ లాడ్జికి వెళ్లి, తీవ్రగాయాల పాలైన మనస్విని ప్రస్తుతం చావు బతుకుల మధ్య నలిగిపోతోంది. నిన్న మనస్వినిని లాడ్జికి తీసుకెళ్లిన వెంకటేశ్ అనే యువకుడు ఆమె గొంతును దారుణంగా కోసిన సంగతి తెలిసిందే. ఆపై ఆమె కేకలు వేస్తుండటంతో లాడ్జి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐదు గంటలకు పైగా ఆపరేషన్ నిర్వహించామని, అయినా మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఆమె పరిస్థితి గురించి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. గొంతు వద్ద చాలా లోతుగా తెగడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఆమెకు వెంటిలేటర్‌పై వైద్య చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.
Manaswini
Venkatesh
Lover
Police

More Telugu News