వన్డే మ్యాచా? టెస్ట్ మ్యాచా?.... మొదటి పవర్ ప్లేలో ప్లాన్ పక్కాగా అమలు చేసిన టీమిండియా
- 10 ఓవర్లలో కివీస్ స్కోరు 27/1
- దూకుడు లోపించిన కివీస్
- పరుగులు సాధించేందుకు ఆపసోపాలు
భారత బౌలర్లు మూలాలకు కట్టుబడి ఎంతో ప్రణాళికబద్ధంగా బంతులు విసరడంతో, కివీస్ జట్టు తొలి ఫోర్ కొట్టడానికి 7.5 ఓవర్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు చేసిన పరుగులు 27 మాత్రమే. అప్పటికి ఓ వికెట్ కూడా కోల్పోయింది. మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ ఆడుతున్న విధానం చూస్తుంటే ఇది వన్డే మ్యాచా? లేక, టెస్ట్ మ్యాచా? అనే సందేహం కలుగుతోంది! క్రీజులో విలియమ్సన్, నికోల్స్ వంటి హేమాహేమీలున్నా స్కోరుబోర్డు నత్తనడకన ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 13 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 44 పరుగులు.