Bollywood: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పై కేపీహెచ్బీ పీఎస్ లో కేసు నమోదు

షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ ఓ ఫిట్ నెస్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. హైదరాబాద్ శివారు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో హృతిక్ పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. కల్ట్ ఫిట్ నెస్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా హృతిక్ వ్యవహరించాడు. అయితే, ఫిట్ నెస్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సదరు సెంటర్ యాజమాన్యంపై ఆరోపణలు తలెత్తాయి.

ఫిట్ నెస్ ప్యాకేజ్ కింద డబ్బులు చెల్లించినప్పటికీ తమకు స్లాట్ ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిట్ నెస్ ప్యాకేజ్ కింద రూ.17,490 నుంచి రూ.36,400 వరకు వసూలు చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. హృతిక్ రోషన్ బ్రాండింగ్ చూసే ఈ సెంటర్ లో డబ్బు చెల్లించి, అందులో చేరామని తమ ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.  
Go Back to Shorts
Bollywood
Hero
Hruthik Roshan
KPHB

More Telugu News