నటుడు శివాజీ పాస్ పోర్టు సీజ్.. 11న మరోసారి విచారణకు రావాలని పోలీసుల ఆదేశం!
- అమెరికాకు పారిపోతుండగా అదుపులోకి
- సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసుల జారీ
- కారులో ఇంటికి వెళ్లిపోయిన నటుడు శివాజీ
ఈ సందర్భంగా ఆయనకు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. జూలై 11న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీఅయిన నేపథ్యంలో శివాజీని ఎయిర్ పోర్టులో గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందజేశారు.