ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా... బిగ్ బాస్-3 హోస్ట్ గా నాగార్జున!

  • టీజర్ రిలీజ్ చేసిన స్టార్ మా
  • 14 మందితో 100 రోజులు
  • డైలాగులతో సందడి చేసిన నాగ్
తెలుగు టెలివిజన్ రంగంలో భారీ రియాల్టీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ మళ్లీ వస్తోంది. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్-3 ప్రారంభం కానుంది. అయితే, ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షోని మూడో సీజన్ లో నడిపించేదెవరన్న ఉత్కంఠకు స్టార్ మా చానల్ తెరదించింది. బిగ్ బాస్ తాజా సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తారు. ఈ మేరకు స్టార్ మా చానల్ టీజర్ రిలీజ్ చేసింది. కూరగాయల మార్కెట్ కు వచ్చిన నాగార్జున బస్తాలకు బస్తాలు కూరగాయలు కొనుగోలు చేయడంతో టీజర్ మొదలవుతుంది.  తనను చూసి అమ్మకందార్లు ఆశ్చర్యపోతుండగానే, 14 మంది, 100 రోజులు, ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా అంటూ నాగ్ తనదైన శైలిలో డైలాగులు చెప్పి అలరించారు. కాగా, బిగ్ బాస్ తొలి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని హోస్ట్ లు గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Go Back to Shorts
Nagarjuna
Bigg Boss-3
Tollywood
Andhra Pradesh
Telangana

More Telugu News