jagan: దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: ఏపీ హోంమంత్రి సుచరిత

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులపై హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. దాడులు జరిగే ప్రతి చోట తాము కాపలా ఉండటం సాధ్యం కాదని ఆమె అన్నారు. దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే... నిందితులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇతర పార్టీల నేతలపై దాడులు జరగాలని తాము కోరుకోవడం లేదని అన్నారు. రాజకీయ దాడులపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ కూడా చెప్పారని గుర్తు చేశారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆమె పైవ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
jagan
sucharitha
ysrcp

More Telugu News