నా ఖర్మ.. నీతో నీతులు చెప్పించుకోవాల్సి వస్తోంది.. విజయసాయిరెడ్డికి దేవినేని ఉమ కౌంటర్!
- బ్రీఫ్ కేసు బినామీ కంపెనీలు పెట్టావు
- 16 నెలలు జైలులో ఉన్న నువ్వు కూడా చెబుతున్నావ్
- ఇప్పటికైనా మంచిగా ఉండు
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
నువ్వు బినామీ బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి ఏ2 ముద్దాయిగా 16 నెలలు జైలులో ఉన్నావు. ఇవాళ కాలం కలిసి వచ్చింది. ఈరోజు ఢిల్లీలో ఓ కేబినెట్ హోదాను వెలగబెడుతున్నావ్. ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నావ్. నన్ను దొంగ అంటున్నావ్. నువ్వు చెప్పే దొంగ కేసుల్లో నేను ఇంకా దొంగను కాలేదు విజయసాయిరెడ్డీ. పిచ్చి మాటలు మానేయ్. మంచిగా ఉండు’ అని హితవు పలికారు.