నన్ను అడగకుండా కార్పొరేషన్ లో జగన్ ఫొటో పెడతారా?: అధికారులపై విజయవాడ మేయర్ చిందులు
- ఎన్టీఆర్, చంద్రబాబు ఫొటోలు తొలగించడంపై ఆగ్రహం
- ఎన్టీఆర్ ఫొటోను మళ్లీ యథాస్థానంలో పెట్టాలని ఆదేశం
- అడ్డుకున్న వైసీపీ.. ఎన్టీఆర్ తో పాటు వైఎస్సార్ ఫొటో కూడా పెట్టాలని డిమాండ్
దీనికి వైసీపీ కార్పొరేటర్లు అడ్డు తగిలారు. ఒకవేళ ఎన్టీఆర్ ఫొటో పెట్టాల్సి వస్తే, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఇందుకు మేయర్ శ్రీధర్ ఒప్పుకోలేదు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగగా, మేయర్ కు టీడీపీ కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.